Andhra Pradesh: అధికారం కోసమే దగ్గుబాటి ఫ్యామిలీ, లక్ష్మీపార్వతి వైసీపీలో చేరారు!: సీఎం చంద్రబాబు

  • దగ్గుబాటి చేరని పార్టీ లేదు
  • తొలుత ఆరెస్సెస్-బీజేపీ, ఆ తర్వాత వైసీపీ
  • అవకాశవాదంతో ఎన్టీఆర్ ను వాడుకున్నారు
అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. దగ్గుబాటి ఫ్యామిలీ చేరని పార్టీలు లేవనీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్), బీజేపీ, ఇప్పుడు వైసీపీ ఇలా రకరకాల పార్టీలు మారారని దుయ్యబట్టారు. అధికారం కోసమే ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కు అయ్యారని విమర్శించారు. టీడీపీ ముఖ్యనేతలతో ఈరోజు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌ హయాంలో పురందేశ్వరి కేంద్రమంత్రి, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వదిలేసి బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు వైసీపీలో చేరారు. అధికారం కోసమే వీళ్ల ఫిరాయింపులన్నీ' అని విమర్శించారు. వీరంతా అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారనీ, ఎన్టీఆర్ కు అప్రతిష్ట తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ప్రస్తుతం అవకాశవాదులంతా వైసీపీలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
daggubati
YSRCP
BJP

More Telugu News