Pawan Kalyan: మా సత్తా ఏంటో చూపిస్తాం.. అమరావతిని స్వాధీనం చేసుకుంటాం: పవన్ కల్యాణ్
- జనసేనను అణచివేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చేసుకోండి
- ప్రతి వ్యూహాలు వేయకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు
- అధికారం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు
జనసేనను అణచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు. తమను అణచివేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చేసుకోవాలని... వాటికి ప్రతి వ్యూహాలను వేయలేకపోతే తన పేరు పవన్ కల్యాణే కాదని అన్నారు. అమరావతిలో తమ సత్తా ఏంటో చూపిస్తామని... అమరావతిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
గుంటూరులో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై అన్ని పార్టీలు కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. కావాలంటే ఎన్నికల్లో ఎవరికివారు వేర్వేరుగా పోటీ చేద్దామని అన్నారు. తనకు ప్రజలు అండగా లేకపోయినా... జీవితాంతం వారికి తాను అండగానే ఉంటానని చెప్పారు. అధికారం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని... ఆ కోరికే ఉంటే 2009లోనే ఎంపీనో, ఎమ్మెల్యేనో అయ్యుండేవాడినని తెలిపారు.