Chandrababu: అన్నీ తెలుసని చంద్రబాబు అనుకుంటారు.. కానీ, క్షేత్ర స్థాయిలో జరిగేది ఆయనకు తెలియదు: పవన్ కల్యాణ్

  • అవినీతి వారసత్వ రాజకీయాలతో విసిగిపోయాం
  • అణగారిన వర్గాల కోసం తెగించి పోరాడుతా
  • లక్షల కోట్ల నిధులతో రాజకీయ పార్టీలు నడవటం అవసరమా?
అవినీతి వారసత్వ రాజకీయాలతో విసిగిపోయామని... ఇకనైనా వాటికి స్వస్తి పలుకుదామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సినిమాల్లో హీరోగా ఎన్నో పాత్రలను పోషించానని... నిజజీవితంలో కూడా హీరోగా నిజాయతీతో ఉండటానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అణగారిన వర్గాలకు న్యాయం చేస్తానని... తెగించి పోరాడుతానని తెలిపారు.

 రాజధానికి దగ్గర్లో ఉండే గుంటూరులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం దారుణమని అన్నారు. డ్రైనేజీలో ఉన్న లోపం కారణంగా... కలుషిత నీటిని తాగి పలువురు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అన్నీ తెలుసని అనుకుంటారని... కానీ, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో ఆయనకు తెలియదని చెప్పారు. లక్షల కోట్ల నిధులతో రాజకీయ పార్టీలు నడవడం అవసరమా? అని ప్రశ్నించారు. గుంటూరు సభలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Chandrababu
Pawan Kalyan
janasena
Telugudesam

More Telugu News