stunt master: చిరంజీవి కూడా మమ్మల్ని పట్టించుకోలేదు: స్టంట్ మాస్టర్ రాజు భార్య లక్ష్మి

  • రాజు చనిపోయి 9 ఏళ్లు అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు
  • రాజు వద్ద చిరంజీవి ట్రైనింగ్ పొందారు
  • సాల్మన్ రాజు గురువును మర్చిపోవడం బాధాకరం
ప్రముఖ సినీ స్టంట్ మాస్టర్ రాజు 67వ జయంతిని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయి పేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భార్య అనంతలక్ష్మి మాట్లాడుతూ, ఎన్టీఆర్, చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు తన భర్త మంచి హిట్స్ ఇచ్చారని చెప్పారు. రాజు చనిపోయి 9 ఏళ్లు అవుతున్నా తమను సినీపరిశ్రమ కానీ, ప్రభుత్వాలు కానీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజు వద్ద చిరంజీవి ట్రైనింగ్ పొందారని, చాలా గొప్ప స్థాయికి ఎదిగారని, చివరకు ఆయన కూడా తమను పట్టించుకోలేదని అన్నారు. రామ్ లక్ష్మణ్, బాహుబలి ఫైట్ మాస్టర్ సాల్మన్ రాజు కూడా తన భర్త శిష్యులేనని చెప్పారు. సాల్మన్ రాజుకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని... అయితే, గురువు రాజును మర్చిపోవడం మాత్రం బాధాకరమని అన్నారు.
stunt master
raju
Chiranjeevi

More Telugu News