modi: అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మోదీ

  • అన్ని వర్గాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లపై ప్రభావం పడదు
  • అగ్రవర్ణ కోటాపై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి
అగ్రవర్ణ పేదలకు జనరల్ కేటగిరీలో కల్పించిన 10 శాతం కోటాకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అగ్రవర్ణ కోటాపై వివిధ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని... వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తమిళనాడులోని తోపూర్ లో ఈరోజు జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు విద్య, ఉపాధి అవకాశాలను తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం పడకుండా... అగ్రవర్ణ పేదలకు కోటాను వర్తింపజేస్తామని తెలిపారు.
modi
upper caste
ebc
reservations

More Telugu News