Chandrababu: బీసీని మేము ప్రధాని చేశాం.. మీరు సీఎం చేయగలరా?: చంద్రబాబుకి సోము వీర్రాజు సవాల్

  • బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ
  • బీసీ ప్రధానిని ఆయన తిడుతున్నారు
  • చంద్రబాబు వ్యక్తిత్వాన్ని బీసీలు అర్థం చేసుకుంటున్నారు
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బీసీ గర్జనపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. బీసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబుది కపట ప్రేమ అని విమర్శించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీదని... బీసీని చంద్రబాబు సీఎం చేయగలరా? అని సవాల్ విసిరారు.

 బీసీ అయిన ప్రధాని మోదీపై చంద్రబాబు అవాకులు చవాకులు పేలుతున్నారని... బీసీలపై ఆయనకు ఎంత ప్రేమ ఉందో వెనుకబడిన కులాల వారు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. స్కూల్ యూనిఫాంలు కుట్టినవారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పార్లమెంటులో పోలవరం ప్రాజెక్టు గురించి బీజేపీ మాత్రమే ప్రస్తావించిందని... పోలవరంపై మాట్లాడే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. నదుల అనుసంధానానికి వాజ్ పేయి మాత్రమే కృషి చేశారని అన్నారు.
Chandrababu
somu veerraju
modi
bc
bjp
Telugudesam

More Telugu News