Bharath: కలకలం రేపుతున్న ప్రేమజంట ఆత్మహత్య

  • ప్రేమలో భరత్, గౌరుబాయ్
  • పెళ్లి చేసుకోవాలని నిర్ణయం
  • తల్లి మందలించిందని ఆత్మహత్య
ఓ ప్రేమజంట ఆత్మహత్య కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. వాంకిడి మండలంలోని గొయేగాం గ్రామానికి చెందిన మెడ్పచి భరత్(22) అదే గ్రామానికి చెందిన కుర్సంగే గౌరుబాయి(18) ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.

కానీ తన తల్లి ప్రేమ విషయమై మందలించేసరికి గౌరుబాయి శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియురాలి మరణం గురించి తెలుసుకున్న భరత్ తీవ్రంగా కుంగిపోయాడు. దీంతో నేడు అతను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
Bharath
Gourubai
Vankidi
Marriage
Suicide

More Telugu News