Naga chaitanya: చైతు కూడా బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడట!

  • రియల్ ఎస్టేట్‌పై దృష్టి పెడుతున్న చైతు
  • సమంతతో కలిసి బడా రియల్టర్లతో చర్చలు
  • వైజాగ్‌లో భారీగా భూములు కొనాలని ప్లాన్
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమనే విషయం సినీ నటీనటులకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదు. అందివచ్చిన అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటూ ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఇప్పటి నటీనటులైతే మరో అడుగు ముందుకేసి అటు సినీరంగంతో పాటు.. బిజినెస్‌లోనూ రాణిస్తున్నారు. ఎక్కువ మంది నటీనటులు రెస్టారెంట్ బిజినెస్ వైపు మొగ్గు చూపుతుంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాస్త వినూత్నంగా ఆలోచించి మల్టీప్లెక్స్ థియేటర్‌ను కట్టి రాణిస్తున్నాడు.

ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య కూడా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నాడట. అయితే ఈ యంగ్ హీరో కన్ను రియల్ ఎస్టేట్‌పై పడిందట. విశాఖలో సినిమా స్టూడియోలు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో అక్కడ భారీగా భూములు కొనాలని భార్య సమంతతో కలిసి చైతూ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే చైతు, సామ్ వైజాగ్‌లోని బడా బడా రియల్టర్లను కలిసి సమాచారం సేకరిస్తున్నారట. అన్నీ ఓకే అయితే చైతు రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలైనట్టేనని ఫిలింనగర్ టాక్.
Naga chaitanya
Samantha
Mahesh Babu
Vizag
Business
Multiplex

More Telugu News