Chandrababu: అప్పుడు గాడ్సేలా కనిపించిన వ్యక్తి ఇప్పుడు గాంధీలా కనిపిస్తున్నారా?: వంగవీటి రాధాకి రామచంద్రయ్య ప్రశ్న

  • రంగాను చంపింది టీడీపీనే అని గతంలో ప్రచారం చేశారు
  • చంద్రబాబు ఇప్పుడు గాంధీలా కనిపించడానికి కారణాలు చెప్పాలి
  • చంద్రబాబు నుంచి ప్రజలను కాపాడే ఏకైక వ్యక్తి జగనే
వైసీపీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధాకృష్ణపై ఆ పార్టీ నేత సి.రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు రాధాకు గాడ్సేలా కనిపించిన చంద్రబాబు... ఇప్పుడు గాంధీలా కనిపించడానికి గల కారణాలను తెలపాలని డిమాండ్ చేశారు. తన తండ్రి రంగాను చంపించింది టీడీపీ, చంద్రబాబేనని గతంలో చేసిన ప్రచారాన్ని రాధా మర్చిపోయారా? అని ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని రామచంద్రయ్య తెలిపారు. కుప్పలుతెప్పలుగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారని.... వాటిని ఎవరు తీరుస్తారని మండిపడ్డారు. చంద్రబాబు రాక్షస పాలన నుంచి ప్రజలను కాపాడే ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని చెప్పారు.
Chandrababu
ranga
radha
vangaveeti
c ramachandraiah
Telugudesam
ysrcp
jagan

More Telugu News