Telangana: గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టుల ఫలితాలను ప్రకటించిన టీఎస్ పీఎస్సీ!

  • కమిషన్ వెబ్ సైట్ లో జాబితా
  • ఆరు సబ్జెక్టుల్లో 255 ఖాళీల భర్తీ
  • ట్యూటర్ పోస్టుకు 30న ఇంటర్వ్యూ
గురుకుల డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రకటించింది. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను తమ అధికారిక వెబ్ సైట్ tspsc.gov.inలో పొందుపరిచింది.

బోటనీ, కామర్స్, మైక్రో బయాలజీ, జువాలజీ, సోషియాలజీ, తెలుగు సబ్జెక్టులకు సంబంధించి 255 పోస్టులకు టీఎస్ పీఎస్సీ ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ పూర్తి చేసింది. మరోవైపు వైద్య విద్యలో ట్యూటర్ ఖాళీలకు జనవరి 30న నాంపల్లిలోని టీఎస్ పీఎస్సీ ఆఫీసులో ఇంటర్వ్యూలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
Telangana
tspsc
DL
jobs
interview

More Telugu News