కంగనా రనౌత్ ముందు యాక్షన్ హీరోలు కూడా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు!: వర్మ ప్రశంసలు

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ప్రశంసలు కురిపించారు. కంగనా రనౌత్ ముందు గొప్పగొప్ప యాక్షన్ హీరోలు కూడా దిగదుడుపేనని వ్యాఖ్యానించారు. రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా రనౌత్ నటించిన ‘మణి కర్ణిక’ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలో కంగనా నటనపై వర్మ స్పందించారు.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో ఈరోజు వర్మ స్పందిస్తూ..‘మణికర్ణికలో కంగనా రనౌత్ అనే గొప్ప హీరోను చూశాక యాక్షన్ హీరోలందరూ నాకు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. వర్మ ప్రస్తుతం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ రాజకీయ, వ్యక్తిగత జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Bollywood
ram gopal varma
manikarnika
praise
kangana ranaut

More Telugu News