raviteja: రవితేజ 'డిస్కో రాజా' టైటిల్ పోస్టర్ రిలీజ్

షార్ట్స్‌లో చూడండి
రామ్ తాళ్లూరి నిర్మాణంలో .. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితం కానుంది. తాజాగా ఈ సినిమాకి 'డిస్కో రాజా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజున రవితేజ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను వదిలారు.

బటర్ ఫ్లై రూపంలో తెలుగు .. ఇంగ్లిష్ కలిసిన లెటర్స్ తో టైటిల్ ను ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. టైటిల్ క్రింద రివైండ్ .. ఫార్వార్డ్ .. కిల్ అంటూ కొన్ని సంకేతాలతో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకి ముందు రవితేజ చేసిన మూడు సినిమాలు పరాజయాలను మూటగట్టుకున్నాయి. అందువలన ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. రవితేజ అభిమానులు కూడా అదే నమ్మకంతో వున్నారు.
Go Back to Shorts
raviteja

More Telugu News