Ram gopal varma: జీసస్ చెప్పారు.. కేఏ పాల్‌కు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడదట!: వర్మ సెటైర్

  • వర్మ తన కాళ్లు పట్టుకున్నాడన్న కేఏ పాల్
  • మెదడు సెట్ అవుతుందని అలా చేశానన్న వర్మ 
  • తన ఓటును కూడా తనకు వేసుకోలేడన్న వర్మ
సెటైరికల్ ట్వీట్లు చేయడంలో దిట్ట అయిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి అటువంటి ట్వీటే చేశాడు. 2017లో తాజ్ హోటల్‌లో వర్మ తన కాళ్లు పట్టుకున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇటీవల పేర్కొన్నారు. దీనికి వర్మ స్పందిస్తూ.. పాల్ కాళ్లు పట్టుకున్న మాట వాస్తవమేనని, అయితే, ఆయనకు మొక్కడానికి కాదని, కాళ్లు పట్టుకుని లాగడానికని పేర్కొన్నాడు. అలా చేస్తే కిందపడ్డప్పుడు దెబ్బతిన్న ఆయన మెదడు తిరిగి సెట్ అవుతుందన్న ఆశతోనే అలా చేశానని పేర్కొన్నాడు. అయితే, ఆ తర్వాత జీసస్‌ను పంపి ఏమైనా చేస్తాడన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు వర్మ చెప్పాడు.

తాజాగా, ఓ ట్వీట్ చేస్తూ .. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కేఏ పాల్‌కు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడదని వర్మ పేర్కొన్నాడు. అంతేకాదు, తన ఓటును కూడా తనకు వేసుకోలేడని, ఈ విషయాన్ని జీసస్ తనకు చెప్పాడంటూ వర్మ సెటైర్ వేశాడు.
Ram gopal varma
KA Paul
Twitter
Andhra Pradesh
Tollywood

More Telugu News