మీ ఇష్టం.. మీరే నిర్ణయించుకోండి!: ఎన్నికల్లో పోటీపై అద్వానీ, జోషిలకు బీజేపీ సూచన
- బీజేపీలో ఏజ్ బార్ లిమిట్
- 75 ఏళ్లు దాటిన వారికి మంత్రివర్గంలో చోటు లేదు
- ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని అద్వానీ, జోషిలకే వదిలేసిన హైకమాండ్
75 ఏళ్ల వయసు పైబడిన నేతలను బీజేపీ ప్రస్తుత నాయకత్వం మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం వయోపరిమితి విధించలేదు. అద్వానీ ప్రస్తుత వయసు 91 కాగా... జోషి వయసు 84 ఏళ్లు. మరోవైపు అనారోగ్య కారణాలతో సుష్మాస్వరాజ్, ఉమా భారతిలు కూడా ఎన్నికలకు దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు జోషికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి మాట్లాడుతూ, పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు జోషి నడుచుకుంటారని చెప్పారు.