mizaan jeffrey: హిందీలోకి రీమేక్ అవుతోన్న '7జి బృందావన కాలని'

  • తమిళంలో సూపర్ హిట్ మూవీ
  •  తెలుగులోనూ ఘన విజయం 
  • హీరోగా జావెద్ జఫ్రీ తనయుడు
తెలుగు .. తమిళ భాషల్లో హిట్ అయిన సినిమాలు హిందీలో రీమేక్ అవుతుండటం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అయితే 14 సంవత్సరాల క్రితం తమిళ .. తెలుగు భాషల్లో ఘన విజయాన్ని అందుకున్న ఒక ప్రేమకథను ఇప్పుడు హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తుండటమే విశేషం .. ఆ సినిమాయే '7జి బృందావన కాలని'.

2004 అక్టోబర్లో '7జి రెయిన్బో కాలని' పేరుతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. '7జి బృందావన కాలని' పేరుతో తెలుగులో విడుదలై హిట్ కొట్టింది. అలాంటి ఈ సినిమాను టి సిరీస్ తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ హిందీలో నిర్మిస్తున్నారు. మంగేశ్ హద్వాలే ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. జావెద్ జెఫ్రీ తనయుడు మిజాన్ జఫ్రీ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
mizaan jeffrey

More Telugu News