వైసీపీలో చేరిన కడప కాంగ్రెస్ నేతలు.. కండువా కప్పి స్వయంగా ఆహ్వానించిన జగన్!
- వైసీపీలో చేరిన రవిచంద్రా రెడ్డి, హరిచంద్రా రెడ్డి
- పార్టీ పటిష్టతకు కృషి చేయాలని జగన్ సూచన
- టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయన్న నేతలు
ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ, రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామని తెలిపారు. కనుమూరు రవిచంద్రా రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కు అయిందని విమర్శించారు. కాంగ్రెస్-టీడీపీ రహస్య అజెండాతో ముందుకు పోతున్నాయని ఆరోపించారు. పార్టీ తీరు నచ్చకపోవడంతోనే వైసీపీలో చేరామని స్పష్టం చేశారు.
ఏపీలో 60-70 నియోజకవర్గాల్లో దాదాపు 10,000 చొప్పున ఓట్లను చీల్చడానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి టీడీపీతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.