imandi ramarao: మనుషులను చదివేయడం అక్కినేనికి వెన్నతో పెట్టిన విద్య: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు
- ఎదుటివారిని స్కాన్ చేస్తారు
- సెట్లో ఎంతో సరదాగా ఉంటారు
- అక్కినేనితో నటన అంటే మాటలా
సీనియర్ జర్నలిస్ట్ .. దర్శకుడు ఇమంది రామారావు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావించారు. "నాగేశ్వరరావు ఎదుటి వ్యక్తిని వెంటనే స్కాన్ చేసేస్తారు. ఒక్కసారి చూస్తే అవతలివారి స్వభావాన్ని ఆయన వెంటనే చెప్పేయగలరు. ఎదుటివారు ఎలాంటివారు అనే విషయంలో ఒక నిర్ధారణకు వచ్చిన తరువాతనే వాళ్లకి ఆయన దగ్గరవుతారు.
అక్కినేని నాగేశ్వరరావుతో నటించడం అంటే మాటలు కాదు .. అందువలన కథానాయికలు భయపడేవారు. అలాంటి జంకు వుంటే సీన్ బాగా పండదు. అందువలన వాళ్లతో సెట్లో సరదాగా ఉంటూ .. వాళ్లలోని భయాన్ని పోగొడతారు. తెరపై ప్రతి హీరోయిన్ తోను అక్కినేని కెమిస్ట్రీ కుదరడానికి గల కారణం ఇదే. నాగేశ్వరరావుగారు ఉన్నంత సేపు సెట్ అంతా కూడా సందడిగా ఉంటుంది. మనుషులను తనవైపుకు మలుచుకోవడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య"అని చెప్పుకొచ్చారు.