Andhra Pradesh: విజయనగరంలో ఓటర్ లిస్ట్ తో సర్వే.. అడ్డుకున్న వైసీపీ నేత మజ్జి శ్రీనివాస్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • సర్వే నిర్వహించిన ప్రైవేటు కంపెనీ
  • అడ్డుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు
  • ట్యాబ్ లు లాక్కున్న మజ్జి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో నిన్న ఉద్రిక్తత తలెత్తింది. జిల్లాలోని నెల్లిమర్లలో ఉన్న కుమిలిలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు ఓటర్ జాబితాతో సర్వే నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. సర్వే విషయం తెలుసుకున్న వైసీపీ నేత మజ్జి శ్రీనివాస్, కార్యకర్తలు వీరిని అడ్డుకున్నారు. అనంతరం సర్వే కోసం వాడుతున్న ట్యాబ్ లను లాక్కుని ఈ వ్యక్తులను పోలీసులకు అప్పగించారు.

అయితే సదరు ట్యాబ్ లను మజ్జి శ్రీనివాస్ తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో ట్యాబ్ లు తమకు ఇవ్వాలని కోరినా మజ్జి శ్రీనివాస్ స్పందించకపోవడంతో పోలీసులు ఆయన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం ఏం జరగబోతోందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Andhra Pradesh
Vijayanagaram District
survey
YSRCP
majji srinivas
Botsa Satyanarayana
angry
complaint
Police

More Telugu News