Vijayawada: విజయవాడ వైద్యుడు డాక్టర్ ఆరుమళ్ల శ్రీధర్ రెడ్డికి ప్రధాని ప్రశంసలు

  • డాక్టర్ శ్రీధర్ రెడ్డికి బాల కల్యాణ్ పురస్కారం
  • రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో అందుకున్న వైద్యుడు 
  • ప్రధాని మోదీని కలిసిన పురస్కార గ్రహీతలు
విజయవాడకు చెందిన దంత వైద్యుడు డాక్టర్ ఆరుమళ్ల శ్రీధర్ రెడ్డిని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. శ్రీధర్ రెడ్డి ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలకు గాను మంగళవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి బాలకల్యాణ్ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం జాతీయ బాలల పురస్కారాల (నేషనల్ చిల్డ్రన్ అవార్డ్స్-2018) పురస్కార గ్రహీతలందరూ గురువారం ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి గత రెండు దశాబ్దాలుగా అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్న ప్రధాని ఆయనను అభినందించారు.
Vijayawada
Doctor Sridhar Reddy
Narendra Modi
Bala kalyan award

More Telugu News