Andhra Pradesh: అదుపు తప్పి లారీని ఢీకొట్టిన ఇన్నోవా.. ముగ్గురి మృతి

  • కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద ఘటన
  • డివైడర్‌ను దాటి మరీ లారీని ఢీకొట్టిన కారు
  • మరో ముగ్గురి పరిస్థితి విషమం
కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పిన ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను దాటి వచ్చి మరీ ఏలూరు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.  ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
Andhra Pradesh
Krishna District
Road Accident
Bapulapadu
Innova car

More Telugu News