India Today: లోక్ సభ ఎన్నికలపై తాజా సర్వే: హంగ్ ఏర్పడుతుందట!

  • ఎన్డీఏకు 237 సీట్లు
  • మేజిక్ ఫిగర్‌ని అందుకునే అవకాశం లేదు
  • యూపీఏకు 166, ఇతరులకు 140
‘మూడ్ ఆఫ్‌ ది నేషన్‌ పోల్‌’ పేరుతో  ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్‌ ఓ సర్వే చేపట్టింది. ఇప్పటికిప్పుడు ఇండియాలో ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశంపై చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

సర్వేలో వెలుగు చూసిన ఫలితాల ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి లోక్‌సభలో భారీగా సీట్లు తగ్గిపోయి.. 237తో సరిపెట్టుకుంటుందని.. మేజిక్ ఫిగర్‌(272)ని అందుకునే అవకాశం లేదని వెల్లడైంది. కానీ ఎన్డీఏ ఓట్ల శాతం మాత్రం పెరుగుతుందట. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి 166, ఇతరులకు 140 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది.

ఇక ఓట్ల విషయానికి వస్తే.. ఎన్డీఏ 35 శాతం, యూపీఏ 33 శాతం ఓట్లను పొందుతాయట. మొత్తంగా ఇప్పటికప్పుడు ఇండియాలో ఎన్నికలు జరిగితే హంగ్ ఏర్పడక తప్పదని సర్వే స్పష్టం చేసింది.
India Today
NDA
UPA
Others
Survey

More Telugu News