Hyderabad: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి

  • లంచం తీసుకుంటూ పట్టుబడిన అజర్
  • రూ.200 ఖర్చయ్యే సర్టిఫికెట్లకు రూ.700 వసూలు
  • అజర్‌ని విచారిస్తున్న అధికారులు
హైదరాబాద్, మూసారాంబాగ్‌లోని అజాంపురా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ అచేశ్వరరావు మాట్లాడుతూ.. భూ పత్రాలకు సంబంధించిన సర్టిఫికెట్ల కోసం లంచం డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో నేడు అంజపురా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో దాడులు నిర్వహించామన్నారు.

ఈ దాడిలో ఎస్ఆర్‌వో ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎండీ అజర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని తెలిపారు. రూ.200 ఖర్చయ్యే సర్టిఫికెట్లకు రూ.700 వసూలు చేస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని అచేశ్వరరావు పేర్కొన్నారు. అజర్‌ని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ఆయన తెలిపారు.   
Hyderabad
Sub Register Office
Acheswararao
Ajampura
AJar

More Telugu News