hansika: హన్సిక ఫోన్, ట్విట్టర్ ఖాతా హ్యాక్!

  • సోషల్ మీడియలో లీకైన హన్సిక వ్యక్తిగత ఫొటోలు
  • తన ఫోన్, ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారన్న హన్సిక
  • వాటి ద్వారా వచ్చే సందేశాలకు స్పందించవద్దని విన్నపం
సినీ నటి హన్సిక వ్యక్తిగత ఫొటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే. విహారయాత్ర కోసం హన్సిక న్యూయార్క్ వెళ్లింది. అక్కడ దిగిన ఆమె వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనిపై హన్సిక స్పందించింది. తన ఫోన్, ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని తెలిపింది. వాటి ద్వారా వచ్చే సందేశాలకు స్పందించవద్దని అభిమానులను కోరింది. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు తన టీమ్ కృషి చేస్తోందని తెలిపింది. గతంలో అక్షరహాసన్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్ తదితరుల ఫొటోలు కూడా లీకయ్యాయి.
hansika
tollywood
kollywood
phone
twitter
hack

More Telugu News