Andhra Pradesh: పరిటాల రవి ప్రజాసేవే ఊపిరిగా బతికారు..పీడిత ప్రజలకు అండగా నిలిచారు!: నారా లోకేశ్

  • నేడు పరిటాల రవి వర్ధంతి
  • నివాళులు అర్పించిన టీడీపీ నేత
  • దావోస్ లో పర్యటిస్తున్న నారా లోకేశ్
తెలుగుదేశం నేత, ఏపీ మాజీ మంత్రి పరిటాల రవి జీవితాంతం  ప్రజాసేవే ఊపిరిగా బతికారని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. పీడిత ప్రజలకు ఆయన అండగా నిలిచారని కితాబిచ్చారు. ఈరోజు పరిటాల రవి వర్ధంతి సందర్భంగా లోకేశ్ నివాళులు అర్పించారు.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ప్రజాసేవే ఊపిరిగా బ్రతికి జీవితాంతం పీడిత ప్రజలకు అండగా నిలిచిన అమరజీవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కీ.శే.పరిటాల రవీంద్రగారి వర్థంతి సందర్భంగా ఆ ప్రజానాయకుడిని సేవలను స్మరించుకుంటూ ఆయన స్మృతికి నివాళులర్పిస్తున్నాను’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో లోకేశ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. తొలుత ఈ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లాల్సి ఉన్నప్పటికీ చివరి క్షణంలో ఆగిపోయారు. దీంతో లోకేశ్ ఏపీ తరఫున హాజరయ్యారు.
Andhra Pradesh
Telugudesam
paritala ravi
death anniversary
Nara Lokesh
Chandrababu
Twitter

More Telugu News