allu arjun: నా వలన నష్టపోయిన వారికి మంచి చేయడం కోసం ఎంతవరకైనా పోతాను: అల్లు అర్జున్

షార్ట్స్‌లో చూడండి
మలయాళంలో ప్రియా వారియర్ తాజా చిత్రంగా 'ఒరు ఆదార్ లవ్' సినిమా నిర్మితమైంది. తెలుగులో ఈ సినిమాను 'లవర్స్ డే' టైటిల్ తో ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "మలయాళ చిత్ర పరిశ్రమతో .. అక్కడి ప్రేక్షకులతో నాకు గల అనుబంధం కారణంగానే ఈ వేడుకకి వచ్చాను"అన్నాడు.

 ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులముందుకు తీసుకువస్తోన్న వినోద్ రెడ్డి .. నా అభిమాని .. నా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తి. 'నా పేరు సూర్య' సినిమాను పంపిణీ చేసి ఆయన నష్టపోయాడు. నష్టపోయినా ఆ విషయంపై మమ్మల్ని ఆయన ఎంతమాత్రం వత్తిడి చేయలేదు. అలాంటి మంచి మనిషికి అండగా వుండాలని అప్పుడే అనుకున్నాను. నా వలన నష్టపోయినవారికి అండగా నిలవడానికి నేను ఎంతమాత్రం సంకోచించను. అలాంటివారికి మంచి చేయడానికి నేను ఎంతవరకైనా పోతాను" అని ఆయన చెప్పాడు.
Go Back to Shorts
allu arjun

More Telugu News