Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడిచేసిన మరో ఎమ్మెల్యే గణేశ్ అదృశ్యం.. పోలీసుల గాలింపు

  • ఎమ్మెల్యే గణేశ్‌పై హత్యాయత్నం కేసు
  • త్వరలోనే అరెస్ట్ చేస్తామన్న హోంమంత్రి
  • చర్యలు తప్పవని హెచ్చరిక
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జేఎన్ గణేశ్ అదృశ్యమయ్యారు. రిసార్ట్‌లో ఓ ఎమ్మెల్యేపై దాడి చేసి కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. శనివారం రాత్రి ఓ రిసార్ట్‌లో కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌పై దాడి చేసిన గణేశ్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు.

ఎమ్మెల్యే గణేశ్ వ్యవహారంపై కర్ణాటక హోంమంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ..  గణేశ్‌ను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తామని, ఎమ్మెల్యే కోసం పోలీసులు వెతుకుతున్నారని చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ తాము మాత్రం వదిలిపెట్టేది లేదని మంత్రి పేర్కొన్నారు.
Karnataka
Congress
JDS
JN Ganesh
murde
Anand Singh

More Telugu News