Andhra Pradesh: ఫేస్‌బుక్ పోస్టుకు అసభ్య కామెంట్.. ఇంటికి పిలిపించి చావగొట్టిన వివాహిత

  • యువకుడిని ఇంటికి పిలిపించి దాడి
  • స్నేహితులతో కలిసి మరోమారు దాడి చేసిన వివాహిత కుమారుడు
  • వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్
ఫేస్‌బుక్‌లో తను పెట్టిన పోస్టుకు అసభ్యంగా కామెంట్ చేసిన వ్యక్తిని ఇంటికి పిలిపించి మరీ చావగొట్టిందో వివాహిత. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మిట్టూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గ్రామానికి చెందిన గీతారెడ్డి అనే మహిళ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. ఇది చూసిన ఆమెకు బంధువయ్యే యువకుడు సాదిక్ అసభ్యంగా కామెంట్ చేశాడు. ఇది చూసిన ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

సాదిక్‌ను ఇంటికి పిలిపించిన మహిళ అతడిని బెడ్ రూములోకి తీసుకెళ్లి, బూతులు తిడుతూ ఎడాపెడా చెంపలు వాయించింది. అక్కడే ఉన్న ఆమె కుమారుడు శరత్ కుమార్, అతడి స్నేహితులు కూడా సాదిక్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత చిత్తూరులోని ఓ కల్యాణ మండపం వద్ద సాదిక్‌పై మరోమారు దాడిచేశారు. ముఖంపై కొడుతూ, కడుపులో తన్నుతూ విచక్షణ రహితంగా కొట్టారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
Andhra Pradesh
Chittoor District
Mittor
Facebook
Viral Videos

More Telugu News