APPSC: ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ

  • నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
  • స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్‌లో 84 పోస్టులు
  • పూర్తి వివరాలు ఏపీపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్‌లో 84 పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 78 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు, 6 అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి.  అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ స్టాటికల్ పోస్టుకు ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు మార్చి 6. మరిన్ని వివరాలకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
APPSC
Andhra Pradesh
Chandrababu
Jobs

More Telugu News