Priyanka Gandhi: వరల్డ్ వైడ్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన ప్రియాంకా గాంధీ

  • ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న సమాచారం
  • టాప్ 15 ట్రెండ్స్‌లో 11 ప్రియాంకవే
  • అగ్రస్థానంలో  #priyanakagandhi
యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కుమార్తె, ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారన్న సమాచారం ప్రపంచంలోనే టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది. ప్రియాంక ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు విభాగానికి ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా నియమితులైన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన అనేక విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో నేటి మధ్యాహ్నం #priyanakagandhi వరల్డ్ వైడ్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

 ప్రియాంకకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు మన దేశంలో టాప్ 15 ట్రెండ్స్‌లో 11 ఉండటం విశేషం. #PriyankaGandhi, #PriyankainPolitics, #PriyankaEntersPolitics ట్యాగ్‌లు భారత్‌లో మొదటి, మూడవ , ఐదో ట్రెండ్‌లో ఉన్నాయి. Priyanka Vadra, AICC General, Cogress General, UP East, General Secretary పదాలు.. వరసగా ఆరు నుంచి 10వ స్థానాల్లో నిలవగా... AICC General, Priyanka Vadra, Cogress General అనే హ్యాష్‌ట్యాగ్‌లు వరసగా 14, 15, 18వ స్థానాల్లో ఉన్నాయి.    
Priyanka Gandhi
Sonia Gandhi
Twitter
Congress
General Secretery

More Telugu News