India: ప్రియాంకా గాంధీకి యూపీ కాంగ్రెస్ బాధ్యతలు.. వెటకారంగా స్పందించిన జీవీఎల్!

  • యూపీ తూర్పు బాధ్యతలు ఇచ్చిన రాహుల్
  • ప్రియాంక గతంలోనూ ప్రచారం చేశారన్న జీవీఎల్
  • అలా జరిగిన ప్రతీసారి కాంగ్రెస్ ఫ్లాపయిందని సెటైర్
ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీని నియమించడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రియాంకకు యూపీ బాధ్యతలు అప్పగించడం తెగ ఉత్సాహపడిపోయే విషయమేమీ కాదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

కానీ కొందరు భజనపరులకు మాత్రం ఇది చాలా పెద్ద, భూమి కంపించిపోయే విషయంగా మారిందని ఎద్దేవా చేశారు. గతంలోనూ ప్రియాంకా గాంధీని ఎన్నికల ప్రచారానికి దించారని జీవీఎల్ గుర్తుచేశారు. ఆమె ప్రచారానికి దిగిన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీ ఫ్లాప్ అయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
India
Congress
BJP
gvl
narasimharao
priyanka gandhi
Rahul Gandhi
criticise

More Telugu News