Andhra Pradesh: టీజీ వెంకటేశ్ కామెంట్లపై చంద్రబాబు అసహనం.. ఇలాంటి వ్యాఖ్యలతో నష్టపోతామని వార్నింగ్!
- పార్టీ పాలసీలపై వ్యక్తిగత ప్రకటనలు వద్దు
- కేడర్ అయోమయంలోకి వెళ్లిపోతుంది
- నేతలు సంయమనంతో వ్యవహరించాలి
టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేత టీజీ వెంకటేశ్ ప్రకటించడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ పాలసీలు, విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ తరహా ప్రకటనలతో కేడర్ లో అయోమయం నెలకొంటుందని చంద్రబాబు పార్టీ నేతల వద్ద అన్నారు.
టీడీపీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు పార్టీ నేతలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. త్వరలోనే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయని సుతిమెత్తగా హెచ్చరించారు. యూపీలో ఉప్పు-నిప్పుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కలిసినప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే తప్పేమిటని టీజీ వెంకటేశ్ అన్నారు.