paruchuri: బ్రహ్మానందం ఆరోగ్యంపై ఆ ప్రచారంలో వాస్తవం లేదు!: పరుచూరి గోపాలకృష్ణ

  • బ్రహ్మానందం విషయంలో ఆందోళన చెందాను
  • యూట్యూబ్ లో రకరకాల ప్రచారాలు
  • ఆయన తిరిగొచ్చి నవ్వుల సందడి చేస్తారు  
రచయితగా వందలాది సినిమాలకి పనిచేసిన పరుచూరి గోపాలకృష్ణ, ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో బ్రహ్మానందం గురించి ప్రస్తావించారు. బ్రహ్మానందం ముంబై హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి చాలా ఆందోళన చెందాను. ఆయన ఆత్మీయులతో మాట్లాడాక మనసు కుదుటపడింది.

ఆయన గ్యాస్ ప్రోబ్లమ్ అనుకుని స్టార్ హాస్పిటల్ కి వెళితే వాళ్లు టెస్ట్ చేసి, వేరే సమస్య వుంది .. సర్జరీకి వెళితే బాగుంటుందని సూచించడంతో కుటుంబ సభ్యులతో కలసి ఆయన ముంబై వెళ్లారు. 'అక్కడికి తీసుకెళ్లారు ..ఇక్కడికి తీసుకెళ్లారు' అంటూ యూట్యూబ్ లో రకరకాల ప్రచారాలు చేస్తున్నారు.. వాటిలో ఎంతమాత్రం నిజం లేదు. ఇప్పుడు కూడా ఆయన కుటుంబ సభ్యులను కనుక్కున్నాను .. ఆయన బాగున్నారు. పెద్దవాళ్లు బ్రహ్మానందాన్ని దీవించండి .. చిన్నవాళ్లు శుభాకాంక్షలు తెలియజేయండి. మళ్లీ ఆయన తిరిగొచ్చి నవ్వుల సందడి చేయాలని మనమంతా కోరుకుందాం" అని చెప్పుకొచ్చారు.
paruchuri
brahmanandam

More Telugu News