India: ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉంటే మద్దతు ఇచ్చేది లేదు!: తేల్చిచెప్పిన శివసేన

  • బదులుగా నితిన్ గడ్కరీని ప్రకటించండి
  • అప్పుడే మద్దతు ఇస్తాం
  • మీడియాతో శివసేన నేత సంజయ్ రౌత్
మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీకి మిత్రపక్షం శివసేన షాక్ ఇచ్చింది. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉంటే మద్దతు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. ఒకవేళ మోదీకి బదులుగా ఆరెస్సెస్ మూలాలు ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతు ఇస్తామని తెలిపింది. ఈ విషయమై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కేవలం తన గురించే ఆలోచిస్తుందని విమర్శించారు.

అందువల్లే తమదారి తాము చూసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ఏ పక్షానికి పూర్తి మెజారిటీ రాబోదనీ, హంగ్ ఏర్పడటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇదిలావుంచితే, ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, మోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని నితిన్ గడ్కరీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
India
BJP
Narendra Modi
Prime Minister
shivasena
sivasena
media
sanjay raut

More Telugu News