Chandrababu: ఎన్డీయేతర పార్టీల సమావేశం వాయిదా.. అమరావతికి చంద్రబాబు తిరుగు ప్రయాణం!

  • నిన్న న్యూఢిల్లీ వెళ్లిన చంద్రబాబు
  • రాహుల్ గాంధీతో భేటీ
  • అందుబాటులో లేని పలువురు నేతలు
అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవానికి సీజే రంజన్ గొగొయ్ ని ఆహ్వానించడంతో పాటు బీజేపీయేతర పక్షాల నేతలతో భేటీ కావాలన్న ఉద్దేశంతో నిన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు రాత్రికే తిరుగు ప్రయాణమయ్యారు. నేడు జరగాల్సిన ఎన్డీయేతర పార్టీల సమావేశం వాయిదా పడటంతోనే చంద్రబాబు తన పర్యటనను ముగించుకుని వెనుదిరిగారు.

 ఈ మీటింగ్ కు పలు పార్టీల నేతలు అందుబాటులో లేకపోవడంతో మరోరోజు సమావేశం పెట్టుకోవాలని నిర్ణయించారు. దీంతో కేవలం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి చర్చించిన చంద్రబాబు, అమరావతికి బయలుదేరారు. మరో రెండు రోజుల్లో విపక్ష భేటీపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోల్ కతాలో జరిగిన విపక్ష ర్యాలీ విజయవంతమైన నేపథ్యంలో, అందరు నేతలూ అందుబాటులో ఉన్నప్పుడే సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలన్నది రాహుల్, చంద్రబాబుల అభిమతంగా తెలుస్తోంది.
Chandrababu
New Delhi
Amaravati
Rahul Gandhi

More Telugu News