donald trump: మా దేశాధ్యక్షుడు ట్రంప్ పెద్ద జాత్యహంకారి: సెనేటర్ బెర్ని శాండర్స్

  • దేశాన్ని జాతి, రంగు, ప్రాంతాలవారీగా విభజిస్తున్నారు
  • అనేక మంది తీవ్ర వివక్షకు గురవుతున్నారు
  • లక్షలాది మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై రాజకీయవేత్త, వార్మోంట్ సెనేటర్ బెర్ని శాండర్స్ తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ పెద్ద జాత్యహంకారి అని విమర్శించారు. సౌత్ కరోలినాలో మార్టిన్ లూథర్ కింగ్ డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో శాండర్స్ మాట్లాడుతూ, దేశాన్ని జాతి, రంగు, లింగ, ప్రాంతాలవారీగా విభజించేందుకు ట్రంప్ యత్నిస్తున్నారని అన్నారు.

గత కొంత కాలంగా అనేక మంది తీవ్ర వివక్షకు గురవుతున్నారని చెప్పారు. ట్రంప్ జాత్యహంకారంతో లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. తినటానికి తిండి కూడా లేక బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షట్ డౌన్ తో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పారు. ఇండిపెండెంట్ సెనేటర్ గా శాండర్స్ వ్యవహరిస్తున్నారు.
donald trump
bernie sanders
racist
america
south corolina

More Telugu News