mla: త్వరలోనే కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభం: స్పీకర్ పోచారం

  • ఆంగ్లో ఇండియన్ తో కలిపి మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు
  • నాలుగున్నర ఎకరాల స్థలంలో క్వార్టర్స్ నిర్మాణం
  • ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 2,500 చదరపు అడుగులు
తెలంగాణ ఎమ్మెల్యేల కోసం హైదరాబాదులోని హైదర్ గూడలో నిర్మించిన నూతన క్వార్టర్స్ ను త్వరలోనే ప్రారంభిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఆంగ్లో ఇండియన్ కోటాలో మరో ఎమ్మెల్యే ఉన్నారు. ఈ 120 మంది ఎమ్మెల్యేలకు ఆధునిక సౌకర్యాలతో క్వార్టర్స్ ను నిర్మించారు. నాలుగున్నర ఎకరాల స్థలంలో వీటి నిర్మాణం జరిగింది. ఒక్కో ఫ్లాట్ ను 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం 3 సెల్లార్లను నిర్మించారు. ఒకే సారి 200 వాహనాలను నిలిపే విధంగా నిర్మాణం జరిగింది. క్వార్టర్స్ నిర్మాణం రూ. 166 కోట్లతో జరిగిందని పోచారం తెలిపారు.
mla
quarters
telangana
Pocharam Srinivas

More Telugu News