Chandrababu: ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు: కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్

  • 10 శాతం కోటాలో 5 శాతాన్ని కాపులకు కేటాయించడం సంతోషకరం
  • కాపులకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారు
  • ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు
అగ్రకుల పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్ కోటాలో 5 శాతాన్ని కాపులకు కేటాయించాలని ఏపీ కేబినెట్ తీర్మానించడం సంతోషకరమని కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ రామానుజయ అన్నారు. కాపుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలో కాపుల కోసం ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేస్తుంటే... అవినీతికి పాల్పడ్డారంటూ ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ లు ఆరోపించడం సిగ్గుచేటని విమర్శించారు. 
Chandrababu
kapu
ramanujaya
Telugudesam

More Telugu News