kangana ranaut: గతంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: కంగనా రనౌత్

  • మీటూ ప్రవర్తనతో ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చింది
  • నటీమణులతో పిచ్చి వేషాలు వేసేందుకు ఆలోచిస్తున్నారు
  • ఆడపిల్లలు భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
తన పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన గురించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వెల్లడించింది. తన తాజా చిత్రం 'మణికర్ణిక' ప్రచారం కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మీటూ ప్రభావంతో చిత్ర సీమలో చాలా మార్పు వచ్చిందని చెప్పింది. మహిళా నటులతో పిచ్చి వేషాలు వేసేవారు... ఇప్పుడు అలా ప్రవర్తించడానికి ఆలోచిస్తున్నారని తెలిపింది.

 గతంలో ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి అసభ్యంగా తనను గిల్లాడని... ఇప్పుడేం చేస్తావ్? అన్నట్టుగా చూశాడని... అతను చూపు తనకు ఎంతో చికాకు కలిగించిందని చెప్పింది. ఆడపిల్లలు తమ భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. రక్షణ కోసం ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని గతంలో రాణీ ముఖర్జీ చెప్పిందని... ఆమె చెప్పింది కరెక్టేనని వెల్లడించింది.
kangana ranaut
mee too
abuse
bollywood

More Telugu News