Mahesh Babu: నేడు నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు.. రొమాంటిక్ గా స్పందించిన మహేశ్ బాబు!

  • 2005, ఫిబ్రవరి 10న మహేశ్-నమ్రత వివాహం
  • ప్రతీక్షణం నమ్రత అండగా ఉందన్న మహేశ్
  • ట్విట్టర్ లో సందేశాన్ని పోస్ట్ చేసిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య, నటి నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ‘నా ప్రియమైన నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితంలో ప్రతీక్షణం అండగా నిలిచినందుకు థ్యాంక్యూ. లవ్ యూ’ అని ట్విట్ చేశాడు. కాగా, ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

1993లో మిస్ ఇండియాగా గెలుపొందిన నమ్రతా శిరోద్కర్.. కొంతకాలం మోడల్ గా పనిచేసింది. జబ్ ప్యార్ కిసీసే హోతాహై (1998), మేరే దో అన్‌మోల్ రతన్ (1998), ఎల్వోసీ కార్గిల్(2003) వంటి హిందీ సినిమాలతో పాటు తెలుగులో వంశీ, అంజి, టక్కరిదొంగ సినిమాల్లో నటించి మెప్పించింది. 2005, ఫిబ్రవరి 10న మహేశ్-నమ్రత ప్రేమ వివాహం చేసుకున్నారు.
Mahesh Babu
Tollywood
namtra
birthday
Twitter
wishes

More Telugu News