‘ప్రజాశాంతి’లో చేరావంటే మంత్రిని చేస్తా.. కుదరకుంటే 100 కోట్లు ఇస్తా!: వంగవీటి రాధకు కేఏ పాల్ బంపర్ ఆఫర్
- టీడీపీలో చేరితే కాపులు క్షమించరు
- రూ.100 కోట్లను రంగా ట్రస్టుకు ఇచ్చేస్తా
- మీడియాతో మాట్లాడిన కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీలో చేరితే తాను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మంత్రిని కూడా చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఈ హామీని నెరవేర్చలేకపోతే రూ.100 కోట్లు చెల్లిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ మొత్తాన్ని వంగవీటి రంగా పేరుపై నడుస్తున్న ట్రస్టుకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. తండ్రిని చంపిన టీడీపీలో చేరితే వంగవీటి రాధాకృష్ణను కాపులు జీవితంలో క్షమించరని హెచ్చరించారు.