vijay devarakonda: మరో లవ్ స్టోరీకి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్

  • 'గీత గోవిందం'తో మెప్పించిన విజయ్ దేవరకొండ
  •  తదుపరి సినిమా వెంకీ అట్లూరితో
  • త్వరలోనే మిగతా వివరాలు        
'గీత గోవిందం' వంటి ప్రేమకథా చిత్రంలో విజయ్ దేవరకొండ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సున్నితమైన ప్రేమకథను తనదైన స్టైల్లో నడిపిస్తూనే ఆయన యూత్ హృదయాలను దోచేసుకున్నాడు. అలాంటి విజయ్ దేవరకొండ .. త్వరలో మరో ప్రేమకథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. 'తొలిప్రేమ'తో హిట్ కొట్టేసిన వెంకీ అట్లూరి.

అఖిల్ తో చేసిన 'మిస్టర్ మజ్ను' సినిమాను ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఆయన, విజయ్ దేవరకొండతో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ  చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తారట. 'డియర్ కామ్రేడ్' సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత, ఒక వైపున క్రాంతిమాధవ్ సినిమాను .. మరో వైపున వెంకీ అట్లూరి సినిమాను చేయడానికి విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నాడని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
vijay devarakonda

More Telugu News