devadas kanakala: నా కంటే ముందే మా ఆవిడ వెళ్లిపోవాలని కోరుకున్నాను .. అలాగే వెళ్లిపోయింది: కన్నీళ్లతో దేవదాస్ కనకాల

  • నా శ్రీమతి పట్ల ఆరాధన వుండేది
  • ఆమెకి ఆ పరిస్థితి రాకూడదని అనుకున్నాను
  • చనిపోయేవరకూ వెంటే వున్నాను
నటుడిగా .. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దేవదాస్ కనకాల, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తన సతీమణి లక్ష్మి గురించి ప్రస్తావించారు. "నా భార్య లక్ష్మి అంటే నాకు ఎంతో ఇష్టం .. ఇష్టం అనేకంటే ఆరాధన అంటేనే కరెక్ట్ గా ఉంటుందేమో. ఆమె లేకుండా నేను బతకలేనేమోనని నాకు అనిపిస్తూ ఉండేది.

ఆమెను వదిలిపెట్టి నేను ముందు వెళ్లిపోకూడదని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. తరువాత ఎవరైనా చూస్తారో .. చూడరో. భర్తను కోల్పోయి ఎవరూ పట్టించుకోక రోడ్డు పక్కన సాయం కోసం ఎదురుచూసే వాళ్లను ఎంతో మందిని నేను చూశాను. అలాంటి పరిస్థితి నా భార్యకు రాకూడదని అనుకునేవాడిని. చనిపోయేంతవరకూ ఆమె వెంటే ఉండాలనీ .. ఆమెను పంపించాకే నేను వెళ్లాలని అనుకునేవాడిని. అలాగే ఆమెను పంపించేశాను" అంటూ ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యారు.
devadas kanakala
ali

More Telugu News