MAOIST: పోలీసులకు సమాచారం ఇచ్చారని.. ముగ్గురిని ఎత్తుకెళ్లి చంపేసిన మావోయిస్టులు!

  • మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఘటన
  • కసంసూర్ లో మావోల సమాచారం లీక్ చేశారని ఆగ్రహం
  • కూంబింగ్ మొదలుపెట్టిన పోలీసులు
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తమ వివరాలను పోలీసులకు రహస్యంగా చేరవేస్తున్నారంటూ భమ్రాగఢ్ లో ముగ్గురిని తుపాకీతో కాల్చిచంపారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరించినందుకే ఈ శిక్ష విధించినట్లు బ్యానర్లు కట్టారు. నిన్నఅర్ధరాత్రి ఈ ముగ్గురి ఇళ్లలోకి చొరబడ్డ మావోయిస్టులు వీరిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.

అనంతరం విచారణ జరిపి పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేసినట్లు అభియోగాలు మోపారు. వీరి కారణంగానే గతేడాది ఏప్రిల్ లో కసంసూర్ ఎన్ కౌంటర్ లో 40 మంది మావోయిస్టులు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తుపాకీతో కాల్చి చంపి పరారయ్యారు. మరోవైపు కుటుంబ సభ్యుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మావోల కోసం గాలింపును ముమ్మరం చేశారు.
MAOIST
Police
Maharashtra
GADCHIROLI
KILLED
THREE
INFORMER

More Telugu News