Narendra Modi: మోదీ వెనక్కు తిరిగి వున్న వేళ, బాలీవుడ్ సెలబ్రిటీల సెల్ఫీ... ఫన్నీగా స్పందించిన ప్రధాని!

  • నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ప్రారంభించిన మోదీ
  • సెల్ఫీలు దిగిన పలువురు సెలబ్రిటీలు
  • మరోసారి సెల్ఫీలు దిగుదామన్న ప్రధాని
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, తన మహారాష్ట్ర పర్యటనలో భాగంగా నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ముంబైలో ఆవిష్కరించిన వేళ, కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు తీసుకున్న సెల్ఫీపై ఆయన ఫన్నీగా స్పందించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఇంతియాజ్ అలీ, కరణ్ జోహార్, కార్తిక్ ఆర్యన్ తదితరులు ఓ సెల్ఫీని దిగగా, అందులో ప్రధాని నరేంద్ర మోదీ, వెనుకవైపున వెనుదిరిగి ఉన్నారు. ఈ సెల్ఫీని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన కార్తీక్ ఆర్యన్, "లూజర్స్... వెనుక మన గౌరవనీయ ప్రధాని" అని క్యాప్షన్ పెట్టడంతో అది వైరల్ అయింది. దీనిపై స్పందించిన ప్రధాని, "మీరెవరూ లూజర్స్ కాదు. రాక్ స్టార్స్. మనం కలిసినప్పుడు (జబ్ వి మెట్) సెల్ఫీ తీసుకోలేకపోయాం. కానీ ముందు ముందు మరో వేడుక ఉంటుంది" అని చమత్కరించారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలోనే 'జబ్ వి మెట్' సినిమా వచ్చిందన్న సంగతి తెలిసిందే.
Narendra Modi
Twitter
Funny
Reply
Mumbai

More Telugu News