vaishnav tej: చిరంజీవి క్లాప్ తో మొదలైన వైష్ణవ్ తేజ్ సినిమా

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి మేనల్లుడిగా సాయిధరమ్ తేజ్ కొంతకాలం క్రితం తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. తొలి రెండు .. మూడు సినిమాలతోనే మాస్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. పాత సినిమాల్లో చిరంజీవి మాదిరిగానే ఉన్నాడనే కితాబును అందుకున్నాడు. ఆయన సోదరుడు వైష్ణవ తేజ్ కూడా నటనవైపే మొగ్గు చూపాడు.ఆయన హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి దర్శకుడు బుచ్చిబాబు రంగంలోకి దిగాడు. సుకుమార్ .. మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా, కొంతసేపటి క్రితమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. చిరంజీవి క్లాప్ కొట్టడంతో తొలి షాట్ ను నాయకా నాయికలపై చిత్రీకరించారు. కథానాయకుడిగా వైష్ణవ్ తేజ్ ఎదగాలని చిరంజీవి .. నాగబాబు మేనమామలుగా తమ ఆశీస్సులు అందజేశారు. ఇంకా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
vaishnav tej

More Telugu News