Paidikondala Manikyala Rao: నిరవధిక దీక్ష ప్రారంభించిన ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు!

  • జిల్లాకు చంద్రబాబు 56 హామీలిచ్చారు
  • ఒక్కదాన్ని కూడా నెరవేర్చే ప్రయత్నం చేయలేదు
  • ఆరోపించిన మాణిక్యాలరావు
పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు ఇచ్చిన 56 హామీలనూ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఈ ఉదయం నిరవధిక దీక్షను ప్రారంభించారు. గత నెల 25న రాజీనామా అల్టిమేటం పంపి దాదాపు నెల రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదని, అందువల్లే తాను ఈ దీక్షను ప్రారంభిస్తున్నానని మాణిక్యాలరావు వెల్లడించారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకూ తన దీక్ష కొనసాగుతుందని చెప్పారు. ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చే ప్రయత్నం చేయలేదని ఆయన ఆరోపించారు.
Paidikondala Manikyala Rao
Tadepalligudem
West Godavari District
Chandrababu

More Telugu News