vangaveeti: బ్రేకింగ్... వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా

  • ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
  • జగన్ కు రాజీనామా లేఖ పంపిన వంగవీటి
  • కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించిన రాధా
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం సంభవించింది. వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. వైసీపీకి రాజీనామా చేసినట్టు కాసేపటి క్రితం ఆయన అధికారికంగా ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరుతారా? లేక జనసేన తీర్థం పుచ్చుకుంటారా? అనే విషయం వేచి చూడాలి. 
vangaveeti
radhakrishna
ysrcp
resign

More Telugu News