Ramya: నార్కట్‌పల్లి సమీపంలో లారీ ఢీకొట్టడంతో మెడికో మృతి

  • హైవేపై స్కూటీని ఢీకొట్టిన లారీ
  • ఇద్దరికి తీవ్ర గాయాలు
  • కేసు విచారిస్తున్న పోలీసులు
హైవేపై వెళుతున్న స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఓ మెడికో అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. నల్లొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం దగ్గర హైవేపై స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెళుతున్న రమ్య అనే మెడికో అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన రమ్య.. కామినేని మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Ramya
Scooty
Lorry
Kamineni Medical College
Medico

More Telugu News