Andhra Pradesh: ఏపీ యువతకు జగన్ ద్రోహం చేస్తున్నారు.. విద్యార్థులకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలి!: మంత్రి కొల్లు రవీంద్ర

  • విద్యాసంస్థల విభజనపై మౌనంగా ఎందుకున్నారు
  • కేసీఆర్ తో జగన్ అంటకాగడం దేనికి సంకేతం?
  • వైసీపీ అధ్యక్షుడికి లేఖ రాసిన ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య విద్యా సంస్థల విభజనపై వైసీపీ అధినేత జగన్ ఎందుకు మాట్లాడటం లేదని టీడీపీ నేత, మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. జగన్ టీఆర్ఎస్ తో అంటకాగుతూ ఏపీ యువతకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ తీరును తప్పుపడుతూ కొల్లు రవీంద్ర ఈరోజు ఆయనకు లేఖ రాశారు. విద్యా సంస్థల విభజనలో ఏపీకి అన్యాయం చేసిన కేసీఆర్ తో జగన్ అంటకాగడం దేనికి సంకేతం? అని మంత్రి ప్రశ్నించారు. ఏపీ విద్యార్థులకు జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యా మండలి ఆస్తుల పంపకం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
YSRCP
Jagan
Telangana
KCR
HEC
property
sharing
Supreme Court
Telugudesam
Kollu Ravindra

More Telugu News