Andhra Pradesh: ఏపీ సీఎం చంద్రబాబును కలుసుకున్న అలీ.. గుంటూరు సీటుపైనే కన్ను!

  • ఉండవల్లిలోని సీఎం నివాసంలో భేటీ
  • మర్యాదపూర్వకంగా కలిశానన్న అలీ
  • మంత్రి పదవిని ఆశిస్తున్న కమెడియన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును ప్రముఖ సినీ నటుడు కమెడియన్ అలీ ఈరోజు కలుసుకున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన అలీ కొద్దిసేపు ముఖ్యమంత్రితో ముచ్చటించారు. అనంతరం వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడారు. తాను చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబును ఇటీవలి కాలంలో అలీ కలవడం ఇది రెండోసారి. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తోనూ అలీ సమావేశమయ్యారు.

దీంతో అలీ వైసీపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే దీన్ని ఖండించిన అలీ.. తాను వైసీపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కాగా, గుంటూరు అసెంబ్లీ సీటును అలీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో మైనారిటీలు ఉన్న నేపథ్యంలో టీడీపీ టికెట్ తనకు ఇవ్వాలని చంద్రబాబు ముందు అలీ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. గతంలో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ.. తనకు గుంటూరు-1 లేదా విజయవాడ-1 లేదా తన స్వస్థలం రాజమండ్రి సీటుతో పాటు మంత్రి పదవి ఇస్తానంటే వైసీపీలో చేరతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
meeting

More Telugu News